చేవ లేక చావలేక బ్రతికి ఏం లాభం బ్రో
రేవు తాకే రేపు దాక ఈదుకుంటు సాగాలిరో
వెక్కిరిస్తూ, వెనక్కి చూస్తూ
నిన్ను దాటి దూసుకెళ్ళే నీ కలల్ని నువ్వు
తాట తీస్తూ, సవాలు చేస్తూ
నిన్న నాటి నీకు పోటీ నువ్వే అనేట్టు రేగిపో
డ్రీమర్
కృషితో జత చేయగ నీ ప్రతి కలని
డ్రీమర్
కసితో అటుగా పడనీ అడుగులని
డ్రీమర్
మలుపే పిలుపై మదికే వినపడగా
డ్రీమర్
గెలుపే వలపై కాదా నీ సొంతం
కలిగే కలకుంది స్వరం, వినబడదా తన గోడు
రగిలే తపనే భాస్వరం, నీ కలలని వెంటాడు
కల కేవలమూహ కాదురా, బ్రతికేందుకు హేతువు మనకు
వెలుపల వెలుగుంది చూడరా, కనులు మూసి చీకటి అనకు
దిండు కింద నలిగే కలలెందుకంట దండగ
గుండె నిండ నింపెయ్ అవి గుర్తుండే విధంగా
రేపనుకోకు, రెప్ప వాల్చేయకు రయ్యని సాగరా
ఊపుని పెంచి, ఉప్పెనై వచ్చి ఉరకలు వెయ్యరా
డ్రీమర్
కృషితో జత చేయగ నీ ప్రతి కలని
డ్రీమర్
కసితో అటుగా పడనీ అడుగులని
డ్రీమర్
మలుపే పిలుపై మదికే వినపడగా
డ్రీమర్
గెలుపే వలపై కాదా నీ సొంతం
డ్రీమర్
కృషితో జత చేయగ నీ ప్రతి కలని
డ్రీమర్
కసితో అటుగా పడనీ అడుగులని
డ్రీమర్
మలుపే పిలుపై మదికే వినపడగా
డ్రీమర్
గెలుపే వలపై కాదా నీ సొంతం